అలవైకుంఠపురంలో నుండి ‘ఓ మై గాడ్ డాడీ’.

Published on Nov 13, 2019 4:44 pm IST

అలవైకుంఠపురంలో మూడవ సాంగ్ టీజర్ విడుదల తేదీని చిత్ర యూనిట్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ఈనెల 14న అంటే రేపు ఉదయం 10:00గంటలకు ‘ఓ మై గాడ్ డాడీ…’ సాంగ్ టీజర్ ని విడుదల చేయనున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అనౌన్స్మెంట్ పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. మొదటి సాంగ్ సామజవరగమనా…సాంగ్ మెలోడీ కాగా, రెండవ పాటగా వచ్చిన రాములో రాములా సాంగ్ తెలంగాణా ఫోక్ బీట్ సాంగ్ లా ఉంది. ఇక మూడవ సాంగ్ కొంచెం ఫన్నీ నోట్ తో సాగే సాంగ్ లా అనిపిస్తుంది. ఈసాంగ్ ఎలా ఉండబోతుందో రేపు టీజర్ చూస్తే కానీ తెలియదు.

ఇక అల వైకుంఠపురంలో టీం ఫ్రాన్స్ లో సందడి చేస్తుంది. శేఖర్ మాస్టర్ మరికొందరు కొరియోగ్రాఫర్స్ పర్యవేక్షణలో సాంగ్స్ తెరకెక్కిస్తున్నారు. పూజా హెగ్డే,బన్నీకి జంటగా నటిస్తుండగా..,టబు,సుశాంత్, నివేదా పేతురాజ్ ఇతర కీలకపాత్రలలో కనిపించనున్నారు. అలవైకుంఠపురంలో చిత్రానికి సంగీతం థమన్ అందిస్తుండగా, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

X
More