మహేష్ బాబుకి అన్నీ తెలుసంటున్న టాప్ టెక్నీషియన్ !

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు టాప్ క్లాస్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. ఆ టెక్నీషియన్లలో సినిమాటోగ్రఫర్ తిరు కూడ ఒకరు. ఆయన మహేష్ బాబు గురించి మాట్లాడుతూ సినిమా యొక్క సాంకేతిక అంశాల గురించి బాగా తెలిసిన ఉత్తమమైన నటుడు మహేష్ బాబు అంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చారు.

అంతేగాక ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని ఉందని కూడ అన్నారు. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. డివివి.దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 27న రిలీజ్ చేయనున్నారు. మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించనున్న ఈ చిత్రం సమైక్య ఆంధ్రప్రదేశ్ లో నడిచే ఫిక్షనల్ పాలిటికల్ డ్రామాలా ఉండనుంది.