ఆ ఫేమస్ కంటెస్టెంట్ కు మరోసారి కరోనా టెస్టా.?

Published on Sep 18, 2020 11:08 am IST

మన తెలుగు స్మాల్ స్క్రీన్ పై బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షో అయినటువంటి “బిగ్ బాస్” నాలుగో సీజన్ కు భారీ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. మొట్ట మొదటి గ్రాండ్ ఎపిసోడ్ కు ఆల్ టైం రికార్డు టీఆర్పీను అందుకున్న ఈ తర్వాత కంటెస్టెంట్స్ పరంగా డల్ గా ఉందని చాలా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. అయితే ఉన్న కొద్ది మందిలో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్న కంటెస్టెంట్ ఎవరన్నా ఉన్నారు అంటే అది యూట్యూబ్ ఫేమ్ గంగవ్వ అని చెప్పాలి.

ఈ లాక్ డౌన్ సమయంలో ఈ షో అన్ని జాగ్రత్తలు తీసుకొని స్టార్ట్ చేసారు. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యే ముందు అందరికీ కరోనా టెస్టులు చేసి వారిని 14 రోజులు పాటు క్వారంటైన్ లో ఉంచారు. ఆ తర్వాతే వారిని ఎంటర్ చేసారు. కానీ ఇపుడు గంగవ్వకు ఆరోగ్యం అంతగా సహకరించడం లేదని టాక్ బయటకు వచ్చింది. దీనితో మేకర్స్ మళ్ళీ ఆమెకు ఒకసారి కరోనా టెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. మరి ఈ విషయంలో ఏం జరగనుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More