ఇంటర్వ్యూ : కార్తికేయ – ఈ సినిమా రిజల్ట్ నాకు బోనస్ !
Published on Nov 15, 2017 12:02 pm IST

ప్రేమతో మీ కార్తీక్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం కాబోతున్న హీరో ‘కార్తికేయ’. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రేమతో మీ కార్తీక్ సినిమా గురించి ‘హీరో ‘కార్తికేయతో ఇంటర్వ్యూ…

ప్ర) సినిమాల్లోకి ఎలా వచ్చారు ?

జ) సినిమాల్లోకి రావాలని చిన్నప్పటి నుండి ఉంది. బీటెక్ పూర్తి అయ్యాక కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించాను. సినిమాల్లో అవకాశం వస్తే బాగుంటుందని అనుకునేవాడిని. ముగురు హీరోలు ఉన్న సినిమా అయినా సరే అందులో ఒకడిగా నటిస్తే బాగుంటుంది అనుకున్నాను. ఒకరోజు ఈ సినిమా నిర్మాత కాల్ చేసి డైరెక్టర్ ని కలవమని చెప్పారు. ఆయన చెప్పిన పాయింట్ నచ్చి సినిమా ఒప్పుకున్నాను.

ప్ర )సినిమా గురించి ?

జ) కార్తీక్ అనే అబ్బాయి అమెరికా లో పుట్టి పెరుగుతారు. లవ్ & ఎమోషన్స్ ఏమి తెలియవు అలాంటి వాడి లైఫ్ లోకి ఒక అమ్మాయి వస్తోంది. ఆ తరువాత వాడి లైఫ్ లో ఎలాంటి మార్పు వచ్చింది అనేది మిగిలిన కథ.

ప్ర ) గొల్లపూడి గారితో వర్క్ ఎలా ఉంది ?

జ) ఆయనతో మాట్లాడటానికి వర్క్ చెయ్యడానికి చాలా మంది వెయిట్ చేస్తూంటారు. అలాంటిది ఆయనతో కలిసి పని చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. సెట్ లో ఆయన నాకు ఇచ్చిన సపోర్ట్ మరువలేనిది. ఆయన ఎపిసోడ్ సినిమాకు మూలం.

ప్ర ) డైరెక్టర్ సత్య గురించి ?

జ) డైరెక్టర్ సత్యకు ఇది ఫస్ట్ సినిమా అయినప్పటికీ చాలా1 అనుభవం కలిగిన దర్శకుడిలా ఈ సినిమా తీశారు. బి.గోపాల్, ఎం.ఎస్ రాజు, విజయ్ భాస్కర్ దగ్గర ఆయన వర్క్ చేయడం జరిగింది. ఎక్కడా రాజి పడకుండా సినిమాను తీసారు. పెద్ద సినిమా తరహాలో ఉండబోతుంది ఈ చిత్రం.

ప్ర) ఈ సినిమాలో నటించినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు ?
జ) చాల హ్యాపీ గా ఉంది ఈ సినిమా రిజల్ట్ నాకు బోనస్. ఎందుకంటే షార్ట్ ఫిలిమ్స్ తీసే నేను ఒక సినిమాలో నటిస్తానని అనుకోలేదు. అది కూడా టైటిల్ రోల్ లో నేను నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మురళి శర్మ తో నటించడం మరిచిపోలేని అనుభూతి.

 
Like us on Facebook