చిరు ట్వీట్ పూరీని అన్ని సమస్యలలోకి నెట్టిందా?

Published on Apr 1, 2020 10:01 am IST

మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ పూరిని సమస్యలలోకి నెట్టింది. పూరి భార్య లావణ్య పూరి ఆయన్ని చెంప దెబ్బకొట్టిందిట. ఈ విషయాన్ని ఓ తెలుగు డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పూరి జగన్నాధ్ బయటపెట్టారు. ఉగాది సందర్భంగా చిరంజీవి తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ప్రారంభించారు. దీనితో టాలీవుడ్ ప్రముఖులు మొత్తం ఆయనకు స్వాగతం తెలిపారు. తనకు ఆహ్వానం పలికిన ప్రతి ఒక్కరికీ రిప్లై ఇచ్చిన చిరంజీవి, పూరికి మాత్రం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

కరోనా కర్ఫ్యూ లో ఉన్న పూరి, నీవు ముంబై, బ్యాంకాక్ బీచ్ లను బాగా మిస్సవుతున్నావు. ఐతే నీ పిల్లలతో సమయం గడుపుతున్నందుకు వారు బాగా సంతోషిస్తూ ఉండి ఉంటారు అన్నారు. ఎప్పుడూ బీచ్ లు పట్టుకు తిరిగే పూరి కరోనా కర్ఫ్యూ కారణంగా ఇంటికే పరిమితం అవుతున్నాడు అనే అర్థం వచ్చేలా చిరంజీవి ట్వీట్ ఉంది. ఈ ట్వీట్ కారణంగా తన భార్యా లావణ్య తనపై కోప్పడిందని పూరి కొంచెం వ్యంగ్యంగా స్పందించారు.

సంబంధిత సమాచారం :

X
More