ఈ ఓటిటి ప్లాట్ ఫేమ్ కి “రామబాణం” స్ట్రీమింగ్ హక్కులు.!

ఈ ఓటిటి ప్లాట్ ఫేమ్ కి “రామబాణం” స్ట్రీమింగ్ హక్కులు.!

Published on May 5, 2023 2:00 PM IST

ఈ వారం టాలీవుడ్ సినిమా దగ్గర రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో మన టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా డింపుల్ హయాతి హీరోయిన్ గా దర్శకుడు శ్రీవాస్ తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “రామబాణం” కూడా ఒకటి. డీసెంట్ ప్రమోషన్స్ మరియు బజ్ మధ్య రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం పై మేకర్స్ మంచి హోప్స్ పెట్టుకోగా లేటెస్ట్ గా అయితే ఈ సినిమా తాలూకా స్ట్రీమింగ్ హక్కులు కోసం తెలుస్తుంది.

ఈ సినిమా తాలూకా స్ట్రీమింగ్ హక్కులు స్ట్రీమింగ్ యాప్ సోనీ లివ్ వారు అయితే సొంతం చేసుకున్నారట. దీనితో పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ ఈ సినిమా అందులో స్ట్రీమింగ్ కి రానుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో జగపతి బాబు గోపీచంద్ కి అన్నయ్యగా నటించగా కుష్బూ, నాజర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే ఈ చిత్రానికి అయితే మిక్కీ జె మేయర్ సంగీతం అందించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు