“సలార్” లో ఈ పార్ట్ ఊహించిన దానికంటే ఎక్కువే అట.!

Published on Jul 9, 2021 7:04 am IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్” అనే భారీ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ కి సన్నద్ధం అవుతుంది. అయితే ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయన్న సంగతి తెలిసిందే.

మరి వీటిని నీల్ మాత్రం ప్రభాస్ కటౌట్ కి తగ్గట్టుగా దగ్గరుండి డిజైన్ చేయిస్తున్నదని తెలుస్తుంది. ప్రభాస్ అభిమానులు కానీ యాక్షన్ మూవీ లవర్స్ కానీ ఎక్కడా డిజప్పాయింట్ కాకుండా వారి అంచనాలను మించే ఉండనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఓ బైక్ చేజింగ్ సీక్వెన్స్ కి అదిరే లెవెల్లో తెరకెక్కించారట. అది కూడా చాలా బాగా వచ్చిందని తెలుస్తుంది. సో యాక్షన్ పార్ట్ వరకు మాత్రం సలార్ సినిమాపై ఎలాంటి డౌట్ పెట్టుకోనక్కర్లేదట..

సంబంధిత సమాచారం :