ఇంకా ‘భీమ్లా’ కంట్రోల్ లోనే ఈ సాలిడ్ రికార్డ్.!

Published on Sep 25, 2021 7:09 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మన టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి లు ప్రధాన పాత్రదారులుగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “భీమ్లా నాయక్” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రాన్ని సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తుండగా త్రివిక్రమ్ మాటలు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అయితే రీమేక్ సినిమా కావడంతో మొదట్లో సినిమాపై నార్మల్ గానే అంచనాలు ఉన్నా సినిమా కి హైప్ ని మాత్రం మేకర్స్ ఒక్కో అప్డేట్ తో ఇంకో లెవెల్ కి తీసుకెళ్లారు.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా గ్లిమ్ప్స్ లకి కూడా భారీ రెస్పాన్స్ లే దక్కాయి. మొదటగా రిలీజ్ చేసిన పవన్ వీడియో కి ఇండియాలోనే ఏ గ్లింప్స్ కి కూడా రాని సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే మరి మొన్న మన సౌత్ ఇండియా లో మరో బిగ్ స్టార్ హీరో అయినటువంటి థలా అజిత్ సినిమా “వలిమై” గ్లింప్స్ రాగా ఇది అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుంది అనుకున్నారు. మరి ఆ అంచనాలకు తగ్గట్టే లైక్స్ పరంగా ఫాస్టెస్ట్ రికార్డ్స్ కొట్టినా వ్యూస్ పరంగా మాత్రం భీమ్లా ని దాటలేకపోయింది. వలిమై సినిమాకి 6.8 మిలియన్ వ్యూస్ రాగా భీమ్లా కి మాత్రం 8.4 మిలియన్ వ్యూస్ వచ్చాయి దీనితో 24 గంటల్లో అత్యధికంగా వీక్షించిన గ్లింప్స్ రికార్డ్ మాత్రం భీమ్లా కంట్రోల్ లోనే ఉందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :