హీట్ పెంచుతున్న “సర్కారు వారి పాట”లో ఈ సీక్వెన్స్.!

Published on May 4, 2021 11:00 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్హ్య్ సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట”. దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే కథ పరంగా మహేష్ ఇమేజ్ కి తగ్గట్టుగా సాలిడ్ మాస్ లైన్ ను తీసుకున్నా ఇందులో ఉండే యాక్షన్ సీక్వెన్స్ లు మాతరం హాలీవుడ్ లెవెల్లో ప్లాన్ చేశారు పెట్ల.

ఆ మధ్య దుబాయ్ లో ప్లాన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ అప్పట్లో ఎంత రచ్చ లేపిందో విన్నాము. మహేష్ కెరీర్ లోనే సాలిడ్ ఛేజింగ్ యాక్షన్ సీక్వెన్స్ గా ఇది నిలుస్తుంది అని అంతా భావించారు. మరి ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సీక్వెన్స్ కు సంబంధించే మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫోటోలు బయటకు వచ్చాయి. వీటి ప్రకారం ఈ సీక్వెన్స్ లో మహేష్ కార్ తోనే కాకుండా బైక్ తో కూడా కనిపిస్తున్నాయి.

అలాగే ఎడారి ప్రాంతంలో మరిన్ని స్పోర్ట్స్ కార్స్ తో విజువల్స్ బయటకు వచ్చాయి. ఇవన్నీ చూస్తుంటే ఈ సీక్వెన్స్ సినిమాలో ఏ టైం లో వస్తుందో కానీ ఏ టైం లో వచ్చినా సరే సిల్వర్ స్క్రీన్ పై గట్టి ట్రీట్ ఇవ్వడం ఖాయం అని చెప్పి తీరాలి. ఇక ఈ భారీ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :