వైరల్ : తారక్ తో ఈ స్టార్ దర్శకుడు..క్లారిటీ కోరుకుంటున్న ఫ్యాన్స్.!

Published on May 22, 2022 10:00 am IST


లేటెస్ట్ గా మన టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో విషెష్ తో హోరెత్తించగా మరోపక్క భారీ ఎత్తున అనేక మంది సినీ తారలు ఎన్టీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. అయితే ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ తన కుటుంబం మరియు ఫ్యామిలీ తో కలిపి జరుపుకున్న బర్త్ డే వేడుకల ఫోటోలు కొన్ని బయటకి వచ్చాయి.

అయితే ఈ వేడుకల్లోనే ఎన్టీఆర్ తో పాటు ఓ స్టార్ట్ దర్శకుడు కూడా దర్శనం ఇవ్వడం వైరల్ గా మారింది. ఆ డైరెక్టర్ మరెవరో కాదు ఇప్పుడు కోలీవుడ్ బిగ్ స్టార్ విజయ్ తో సినిమా చేస్తున్న వంశీ పైడిపల్లి. ఇప్పుడు ఈ దర్శకుడు ఎన్టీఆర్ తో కనిపించడం అభిమానుల్లో ఆసక్తిగా మారింది. ఇంతకు ముందు ఈ ఇద్దరు కలిసి కనిపించడం పెద్దగా లేదు. దీనితో ఇప్పుడు ఈ కాంబో కనిపించడంతో ఈ కలయికపై అంతా ఒక క్లారిటీ వెయిట్ చేస్తున్నారు. మరి అది సినిమా కోసమేనా లేక వేరే ఏమన్నా ఉందా అనేది తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :