చరణ్, శంకర్ ల భారీ సినిమాకి ఈ స్టార్ హీరో గ్రీన్ సిగ్నల్.?

Published on May 5, 2021 12:00 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో హీరోగా దర్శక ధీరుడు రాజమౌళితో “రౌద్రం రణం రుధిరం” అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రం అనంతరం ఇండియన్ జేమ్స్ కేమరూన్ శంకర్ దర్శకత్వంలో మరో భారీ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ చిత్రం కూడా ఓకే చెయ్యడంతో దానిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ చిత్రానికి గాను శంకర్ ఒక్కో ఇండస్ట్రీ నుంచి గట్టి ప్లాన్స్ వేస్తున్న సంగతి తెలిసిందే. అలా కన్నడ నుంచి కీలక పాత్రకు గాను కిచ్చా సుదీప్ ను అనుకుంటున్నారని టాక్ వచ్చింది. మరి లేటెస్ట్ బజ్ ప్రకారం ఆ రోల్ కు గాను కిచ్చా ఓకే చెప్పినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శంకర్ తన రోల్ పై ఆల్రెడీ నరేషన్ వినిపించగా సుదీప్ కు లైన్ నచ్చిందని ఇంకా తాను ఓకే చెప్పడం బాలన్స్ ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజముందో నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :