ఈ స్టార్ హీరోయిన్ అకౌంట్ బ్యాన్ చేసిన ట్విట్టర్.!

Published on May 4, 2021 2:00 pm IST

సోషల్ మీడియా ప్రతీ ఒక్కరికీ కూడా తమ భావాలను వ్యక్త పరిచేందుకు ఉన్న అతి పెద్ద ప్లాట్ ఫామ్. మరి ఇందులో కూడా సామాన్యులతో పాటుగా మన సినీ తరాలు కూడా ఉంటారు. కానీ వాటిలో ఉండే రూల్స్ మాత్రం ప్రతి ఒక్కరికీ ఒకటే.. అలా ఇప్పుడు బాలీవుడ్ కు చెందిన స్టార్ హీరోయిన్ అయినటువంటి కంగనా రనౌత్ సోషల్ మీడియా ఖాతాను ట్విట్టర్ వారు బ్యాన్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

అయితే అసలు విషయానికి వెళ్తే ఇటీవలే లో జరిగిన ఎన్నికలకు సంబంధించి ఆమె పెట్టిన కొన్ని అభ్యంతర పోస్టుల కారణంగా ఆమె అకౌంట్ ను ట్విట్టర్ నుంచి బ్యాన్ చేసి తొలగించారట. దీనితో ఆమె అకౌంట్ తొలగించినందుకు కొందరు ఆనందం వ్యక్తం చేస్తున్న వారు కూడా ఉన్నారు. అయితే ఇది వరకే కంగనా పేరు సోషల్ మీడియాలో పలు కాంట్రవర్సీలతో సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :