సాయి తేజ్ సినిమాను వారు వదలనంటున్నారా?

Published on Sep 20, 2020 12:02 pm IST

మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన మరో టాలెంటెడ్ హీరో సాయి ధరమ్ తేజ్ చాలా కాలం నిరీక్షణ అనంతరం “చిత్ర లహరి” మరియు “ప్రతిరోజూ పండగే” చిత్రాలతో వరుస విజయాలను అందుకొని ట్రాక్ లోకి వచ్చాడు. అయితే ఈ రెండు చిత్రాలు అనంతరం సాయి ధరమ్ తేజ్ ఎన్నో ఆశలు పెట్టుకున్న హ్యాట్రిక్ చిత్రం “సోలో బ్రతుకే సో బెటర్”. నూతన దర్శకుడు సుబ్బు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సినీ వర్గాల్లోనూ ముఖ్యంగా యూత్ లో మంచి హైప్ ను కొనితెచ్చుకుంది.

అదే హైప్ లో సినిమా విడుదల చేద్దామా అనుకునే సమయంలో కరోనా వచ్చి అడ్డుకట్ట వేసింది. అయితే ఈ గ్యాప్ లో ఈ చిత్రం డిజిటల్ హక్కులు కోసం పలు స్ట్రీమింగ్ సంస్థలు పోటీ పడినా జీ 5 వారు మాత్రం అన్నిటికన్నా ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికీ కూడా వారు ఈ చిత్రానికి 30 కోట్లకు పైగా ఆఫర్ చేస్తున్నట్టు సమాచారం. మరి ఇంకా ఈ డీల్ కుదిరిందో లేదో అన్నది తెలియాల్సి ఉంది. ఈ చిత్రంలో సాయి తేజ్ సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More