“పుష్ప 2” పై ఈ వైరల్ టాక్ నిజమేనట.!

“పుష్ప 2” పై ఈ వైరల్ టాక్ నిజమేనట.!

Published on Jul 5, 2022 9:00 AM IST


ప్రస్తుతం పాన్ ఇండియన్ సినిమా దగ్గర ఇంకా షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వకుండా భారీ హైప్ ను నెలకొల్పుకున్న అతి కొద్ది చిత్రాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు సుకుమార్ ల కాంబోలో తెరకెక్కనున్న “పుష్ప ది రూల్” కూడా ఒకటి. అనేక అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రంపై గత కొన్ని రోజులు నుంచి ఓ టాక్ వైరల్ గా మారిన సంగతి చూస్తూనే ఉన్నాము.

తమిళ్ కి చెందిన విలక్షణ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మళ్ళీ ఈ సినిమాలో కనిపించనున్నాడని బజ్ వైరల్ అవుతుండగా ఇప్పుడు ఇది నిజమే అన్నట్టు కన్ఫర్మ్ అవుతుంది. అయితే సేతుపతి గతంలో గోవిందప్ప పాత్రలో కనిపించాల్సి ఉండగా ఈసారి పార్ట్ 2 లో ఓ కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈసారి కూడా పోలీస్ పాత్రే అంటున్నారు కానీ అసలైన క్లారిటీ అయితే ఇక ముందు తెలియాల్సి ఉంది. మొత్తానికి అయితే విజయ్ సేతుపతి పుష్ప 2 లో ఉన్నట్టే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు