మహేష్ కి మంచి గ్యాప్ పడేలా ఉందే..!

Published on Feb 25, 2020 1:39 am IST

మహేష్-వంశీ పైడిపల్లి మూవీ రద్దు అనేది ఇక అధికారికమే అనిపిస్తుంది. ఎందుకనగా కొన్ని రోజులుగా దీనిపై విపరీతమైన చర్చ జరుగుతున్నా వంశీ పైడిపల్లి నోరుమెదపలేదు. ఇక మహేష్ కూడా ఈ విషయాన్ని ఖండించలేదు. మరో వైపు మహేష్ దర్శకుల నుండి కథలు వింటున్నాడని తెలుస్తుంది. కొరటాల శివ కూడా కొన్ని స్టోరీ లైన్స్ వినిపిస్తున్నారని సమాచారం. కొరటాల శివ అయినా మరో దర్శకుడు అయినా మహేష్ నుండి మూవీ రావడానికి చాల సమయం పట్టేలా కనిపిస్తుంది.

కొరటాల ప్రస్తుతం చిరంజీవి 152వ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆయన బయటికి రావడానికి మరో ఆరు నెలలు పడుతుంది. మరో దర్శకుడు తో స్టోరీ సెట్ అయినా స్క్రిప్ట్ పనులు అందులో మార్పులు ఇలా కొంత సమయం పట్టే అవకాశం కలదు. కాబట్టి వంశీ పైడిపల్లి తో మూవీ రద్దైన పక్షంలో మహేష్ కనీసం ఆరు నెలలు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ ఏడాది ఆయన అసలు సినిమా మొదలుపెట్టకపోయినా ఆశ్చర్యం లేదు.

సంబంధిత సమాచారం :