ఈసారి సినిమాలతో హీటెక్కనున్న 2021 సంక్రాంతి.!

Published on Sep 18, 2020 8:12 pm IST


ప్రతీ ఏడాది సంక్రాంతి సీజన్ వచ్చింది అంటే సినీ అభిమానులకు మరో పండుగ కూడా వచ్చినట్టే.. అలా మన టాలీవుడ్ లో ఈ ఏడాది వచ్చిన సినిమాలు ఎప్పుడు లేని విధమైన హీట్ ను పుట్టించాయి. ఇద్దరు స్టార్ హీరోలు సినిమాలు కేవలం వ్యవధితో విడుదల కానుండడంతో మూవీ లవర్స్ నడుమ అదే పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. అయితే వచ్చే ఏడాది మాత్రం మరింత హీట్ ఖాయం అన్నట్టు తెలుస్తుంది.

ఈ ఏడాది అనుకోని విధంగా మారిపోయిన పరిస్థితులు మొత్తం అంశాలను తలకిందులు చేసేశాయి. కానీ ఇప్పుడు షూటింగులు మొదలు కావడంతో ఇప్పటికే షూటింగులు దాదాపు కంప్లీట్ చేసుకున్న చిత్రాలు పూర్తి చేసుకోనున్నాయి. ఇపుడు ఆ కూడా సంక్రాంతి సీజన్ నే టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది.

ఈ రేస్ లో మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న “క్రాక్” నాగ చైతన్య నటించిన “లవ్ స్టోరీ” అంతే కాకుండా “మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్” అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న కం బ్యాక్ చిత్రం “వకీల్ సాబ్” కూడా అదే సమయాన్ని లాక్ చేసుకున్నట్టు టాక్. అలాగే మరో భారీ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2” కూడా లైన్ లో ఉందట. మరి ఈ అన్నిటిలో వాస్తవానికి ఎన్ని చిత్రాలు వస్తాయో చూడాలి.

సంబంధిత సమాచారం :

More