బోయపాటిలో మరో కోణం..”అఖండ”లో స్టన్ చేసిన ఈ విజువల్.!

Published on Dec 11, 2021 7:12 am IST

టాలీవుడ్ టాప్ దర్శకుల్లో మంచి మాస్ సినిమాలు అంటే గుర్తుకొచ్చే దర్శకులు ఒకటి బోయపాటి శ్రీను మరొకరు పూరి జగన్నాథ్. అలాగే ఇద్దరి మాస్ ప్రెజెంటేషన్ కూడా వేరే గానే ఉంటుంది. మరి బోయపాటి శ్రీను విషయానికి వస్తే తన కెరీర్ లో ఇప్పటివరకు మాంచి మాస్ మసాలా డ్రామాలు ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడుకున్నవి చేసారు. అయితే లేటెస్ట్ గా తాను చేసిన “అఖండ” మాత్రం వాటికి కాస్త డిఫరెంట్ అని చెప్పాలి.

తన ముందు సినిమాల్లా ఎక్కడా ఎక్కువ మోతాదు లాజిక్స్ మిస్ చెయ్యకుండా చాలా జాగ్రత్తగా దీన్ని చేసినట్టు అనిపించక మానదు. అయితే బోయపాటి సినిమాలు అంటే ఒక మాస్ ముద్ర ఎక్కువగా అందరికీ తెలుసు కానీ తన సినిమాల్లో తక్కువగా టచ్ చేసినా ఆశ్చర్య పరిచే మరో కోణం కూడా ఉంది. అదే తన సినిమాల్లో అద్భుతమైన విజువల్స్ చూపించడం. చాలా తక్కువగానే గ్రాఫికల్ ట్రీట్ ని బోయపాటి టచ్ చేసాడు.

అప్పుడు ఎన్టీఆర్ తో “దమ్ము”లో ఒక స్పెషల్ సాంగ్ ని కంప్లీట్ నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చెయ్యగా రాజమౌళి నే ఆశ్చర్యపోయారు. ఇక ఇపుడు అఖండ లో అలాంటి ఒక్క సన్నివేశం జస్ట్ 5 సెకండ్ లు కనిపించింది ఒక రేంజ్ లో మూవీ లవర్స్ ని ఆడియెన్స్ ని స్టన్ చేసి కట్టి పడేసింది. సెకండాఫ్ క్లైమాక్స్ లో బాలయ్య రథం చక్రం పట్టుకొని అలా పైకి ఎత్తుతాడు.

దానిని నెక్స్ట్ లెవెల్లో కాల చక్రాన్ని తిప్పే రుద్ర తాండవం చేసే పరమశివుడిలా ప్రెజెంట్ చెయ్యడం అనేది నెక్స్ట్ లెవెల్ సన్నివేశం. ఈ సీన్ ట్రాన్స్ ఇప్పుడు వారి అభిమానులని వెంటాడుతుంది. ఇది బోయపాటిలో ఆశ్చర్యపరిచే మరో కోణం.. అయితే బోయపాటి ఆలోచనని విజువల్ గా చాలా సహజంగా చూపించడంలో వారి విఎఫ్ఎక్స్ యూనిట్ ని స్పెషల్ గా మెన్షన్ చేసి తీరాలి. ఇక తాను బాగా కాన్సన్ట్రేట్ చేసి ఓ భారీ విజువల్ సినిమా తీసినా అదరగొట్టే ఆశ్చర్య పోనక్కర్లేదు.

సంబంధిత సమాచారం :