“పుష్ప” నుంచి అల్లు అర్జున్ కి నచ్చిన సాలిడ్ స్టిల్ ఇదేనట.!

Published on Jan 8, 2022 2:00 pm IST

ఇండియన్ సినిమా దగ్గర రీసెంట్ బిగ్ బ్లాక్ బస్టర్ అయినటువంటి భారీ సినిమా “పుష్ప ది రైజ్”. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ భారీ సినిమా నిన్ననే ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది.

ఇక దీనితో మళ్ళీ పుష్ప అప్పుడు థియేట్రికల్ రెస్పాన్స్ నే మరింత స్థాయిలో అన్ని భాషల్లో వస్తుంది. అయితే ఈ సినిమాలో అవుట్ స్టాండింగ్ గా పుష్ప రాజ్ పాత్రని చేసిన బన్నీ ఈ సినిమా కోసం ఎంతలా కష్టపడ్డాడో తెలిసిందే. కంప్లీట్ గా డీ గ్లామ్ లుక్ లోకి మారి మాస్ గా కనిపించాడు.

మరి తాను చేసిన ఈ పాత్రలో తనకి నచ్చిన స్టిల్ ఇది అంటూ ఒకటి షేర్ చేసుకున్నాడు. పుష్ప రాజ్ గా తన లారీ లో కూర్చిని బీడీ కాలుస్తూ మంచి నాటుగా కనిపించే ఫోటో ని పోస్ట్ చేసి ఈ స్టిల్ తన సినిమాలో తన ఫేవరెట్ అని చెప్పుకొచ్చాడు. దీనితో ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :