ఈ వారం ఎలిమినేషన్ నుండి తప్పించుకుంటే ఫైనల్ కేనా….!

Published on Oct 22, 2019 1:04 am IST

నిన్న వరుణ్ సందేశ్ వైఫ్ వితిక బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ కావడం జరిగింది. నాటకీయ పరిణామాల మధ్య వితిక షేరు బిగ్ బాస్ కి బై చెప్పాల్సివచ్చింది. ఇక హౌస్ లో మిగిలింది స్వీట్ సిక్స్ మెంబర్స్ మాత్రమే. హౌస్ లోకి ప్రవేశించిన 17మందిలో (ఇద్దరు వైల్డ్ ఎంట్రీలతో కలిపి)వరుణ్,బాబా భాస్కర్,అలీ రెజా, రాహుల్,శ్రీముఖి,శివ జ్యోతి మాత్రమే మిగిలారు. వీరిలో వచ్చే వారం ఒకరు ఎలిమినేట్ కాగా మొత్తం ఐదుగురు ఫైనల్ కి వెళతారు. వారిలో ఇద్దరు మాత్రమే టైటిల్ కి పోటీపడతారు. కాబట్టి ఈ వారం నామినేషన్స్ అనేవి కీలకంగా మారనున్నాయి.

నేడు సోమవారం కావడంతో బిగ్ బాస్ నామినేషన్స్ కొరకు టాస్కులు నిర్వహిస్తారు. వీరిలో టాస్క్లో వెనుకబడినవారు ఎలిమినేషన్ కి ఎంపిక అయ్యే అవకాశం కలదు. ఒకవేళ గతవారం మాదిరి ఉన్న ఆరుగురిని నామినేట్ చేసినా ఆశ్చర్యం లేదు. ఇక టైటిల్ ఫేవరేట్ ఎవరనేది క్లిష్టంగా ఉంది. వరుణ్,శ్రీముఖి,బాబా భాస్కర్,రాహుల్ టైటిల్ ఫేవరెట్స్ గా ఉన్నారని తెలుస్తుంది. అలీ రెజా ఒకసారి ఎలిమినేటై మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడు కాబట్టి అతను గెలిచే అవకాశాలు తక్కువ అంటున్నారు. మరి చూడాలి నేడు ఏమవుతుందో.

సంబంధిత సమాచారం :

X
More