“ఆచార్య” రిలీజ్ డేట్ పై అప్పుడు పక్కా క్లారిటీ.!

Published on Aug 19, 2021 7:40 pm IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” అనే భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తుది దశలో ఉన్న ఈ చిత్రం రిలీజ్ ఎప్పుడు అన్నది ఒక రేంజ్ లో ఇపుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ చిత్రం ఈ ఏడాది నుంచి వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ కి షిఫ్ట్ అయ్యిందని రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మరి వీటన్నిటికీ మాత్రం బాస్ తన బర్త్ డే కి ఒక పక్కా క్లారిటీ ఇవ్వనున్నట్టు సమాచారం. “ఆచార్య” నుంచి కొత్త పోస్టర్ ఆల్రెడీ రెడీ అయ్యిందని తెలుస్తుంది. దానిని రాబోయే మెగాస్టార్ బర్త్ డే కి లాంచ్ చేసి ఒక ఫైనల్ క్లారిటీ ని మేకర్స్ ఇవ్వనున్నట్టుగా వినికిడి. సో ఇప్పుడు వైరల్ అవుతున్న స్పెక్యులేషన్స్ కి బాస్ అపుడు చెక్ పెడతారని చెప్పాలి. మరి ఈ చిత్రంలో చరణ్ కూడా కీలక పాత్ర చేస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అలాగే మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :