“విశ్వంభర” ముగింపు అప్పుడే.. ఆ తర్వాత

“విశ్వంభర” ముగింపు అప్పుడే.. ఆ తర్వాత

Published on Apr 10, 2024 8:06 AM IST


టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా స్టార్ నటి త్రిష హీరోయిన్ గా యంగ్ దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న భారీ విజువల్ ట్రీట్ చిత్రం “విశ్వంభర” (Vishwambhara). మరి ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు భారీ పోరాట సన్నివేశాలు చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రం షూటింగ్ సంబంధించి ఆసక్తికర అప్డేట్ తెలుస్తుంది.

ఇది వరకే ఓసారి సినిమా షూటింగ్ ఈ ఏడాది జూలై చివరి నాటికి పూర్తయిపోతుంది అని టాక్ వచ్చింది. అయితే ఇది నిజమే అని తెలుస్తుంది. మేకర్స్ విశ్వంభర షూటింగ్ అంతటినీ ఈ జులై నాటికి మొత్తం పూర్తి చేసేస్తారట. ఇక ఆ తర్వాత నుంచి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మెయిన్ గా సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కోసమే అన్ని నెలలూ కేటాయించినట్టుగా తెలుస్తుంది.

అవి కూడా కంప్లీట్ చేసే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా భారీ ట్రీట్ ని అయితే మేకర్స్ ముందుకు తీసుకురాబోతున్నట్టుగా ఇప్పుడు టాక్. మొత్తానికి విశ్వంభర మేకర్స్ మాత్రం ఓ పక్కా ప్రణాళికతోనే ఉన్నారనిపిస్తుంది. మరి సినిమా బడ్జెట్ ని ఉం క్రియేషన్స్ వారు చాలా ఎక్కువే పెట్టినట్టు టాక్ ఉంది. అవుట్ పుట్ ఏ లెవెల్లో ఉంటుందో చూడాలి మరి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు