తెలుగు రాష్ట్రాల్లో ‘తొలిప్రేమ’ తొలిరోజు వసూళ్లు !

నూతన దర్శకుడు వెంకీ అట్లూరి మెగా హీరో వరుణ్ తేజ్ తో చేసిన ‘తొలిప్రేమ’ చిత్రం తొలిరోజు నుండే ప్రేక్షకులు, విమర్శకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుని హిట్ దిశగా దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే వరుణ్ కెరీర్లో మూడవ ఉత్తమమైన ఓపినింగ్స్ ను సాదించిందీ సినిమా. అలాగే యూఎస్లో కూడ హాఫ్ మిలియన్ డాలర్ మార్కును దాటింది.

అత్యధికంగా నైజాం ఏరియాలో రూ.1.17 కోట్లు రాబట్టిన ఈ చిత్రం మొత్తంగా రెండు రాష్ట్రాల్లో కలిపి రూ.3.21 కోట్ల షేర్ ను నమోదు చేసింది. ఇక ఏరియాల వారీగా చూస్తే కలెక్షన్స్ ఈ కింది విధంగా ఉన్నాయి..

 

ఏరియా వసూళ్లు
నైజాం 1.17కోట్లు
సీడెడ్ 36 లక్షలు
ఉత్తరాంధ్ర 45 లక్షలు
ఈస్ట్ 24 లక్షలు
వెస్ట్ 25 లక్షలు
కృష్ణ 24 లక్షలు
గుంటూరు 38 లక్షలు
నెల్లూరు 12 లక్షలు
మొత్తం 3.21 కోట్లు