రూ.25 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ‘తొలిప్రేమ’ !
Published on Feb 14, 2018 1:40 pm IST

వరుణ్ తేజ్, రాశీఖన్నాల ‘తొలిప్రేమ’ చిత్రం గత వారం విడుదలై బాక్సాఫీస్ వద్ద దిగ్విజయంగా నడుస్తోంది. మల్టీప్లెక్స్ ఆడియన్స్, యువతలో మంచి ఆదరణ పొందిన ఈ సినిమా వసూళ్లు భారీస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే అన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు లాభాల దిశగా అడుగులు వేస్తున్నారు.

నిర్మాణ సంస్థ లెక్కల ప్రకారం మొదటి నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.25.8 కోట్ల గ్రాస్, రూ.14.6 కోట్ల షేర్ ను రాబట్టిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 10.77 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఏరియాల వారీగా వసూళ్ల వివరాల్ని చూస్తే ఈ కింది విధంగా ఉన్నాయి.

ఏరియా  వసూళ్లు
నైజాం    4.08 కోట్లు
సీడెడ్ 1.33 కోట్లు
    వెస్ట్
73 లక్షలు
    ఈస్ట్
90 లక్షలు
   కృష్ణ
 89 లక్షలు
   గుంటూరు
94 లక్షలు
   నెల్లూరు
34 లక్షలు
   ఉత్తరాంధ్ర
1.53 కోట్లు
   మొత్తం
10.77 కోట్లు

 
Like us on Facebook