‘తొలిప్రేమ’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్సైంది !

వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘తొలిప్రేమ’. ఔట్ అండ్ ఔట్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం యొక్క టీజర్, పాటలు పేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. ఇకపోతే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్ర ట్రైలర్ ను ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తామని ప్రటించారు.

నూతన దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ కు జోడీగా రాశీఖన్నా నటిస్తోంది. ఎక్కువ శాతం ఫారిన్లో షూట్ జరుపుకున్న ఈ చిత్రంలో ప్రియదర్శి, హైపర్ ఆది వంటివారు కూడా నటించారు. ఫిబ్రవరి 10న రిలీజ్ కానున్న ఈ చిత్రం తప్పకుండా అభిమానుల్ని మెప్పించే విధంగా ఉంటుందని వరుణ్ తేజ్ బలమైన హామీ కూడా ఇచ్చారు.