శర్వానంద్ హీరోగా రాబోతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’(Nari Nari Naduma Murari). సంక్రాంతి కానుకగా 2026 జనవరి 14న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా కామెడీ పడింది అంటూ టాక్ నడుస్తోంది. ప్రధానంగా శర్వానంద్ – ‘హీరోయిన్లు సంయుక్త, సాక్షి వైద్య’ల మధ్య ట్రాక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని.. ప్రత్యేకంగా సాక్షి వైద్య పాత్ర చాలా భిన్నంగా ఉండబోతోందని తెలుస్తోంది. మాజీ భార్యకి – కాబోయే భార్యకి మధ్య శర్వానంద్ నలిగిపోయే సందర్భాలు కూడా చాలా బాగుంటాయట.
కాగా ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండటంతో ఇందులో ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఢోకా ఉండదని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


