ఈ క్రేజీ ఇండియన్ సినిమా చైనాలోనైనా ఆడుతుందా ?

ఈ క్రేజీ ఇండియన్ సినిమా చైనాలోనైనా ఆడుతుందా ?

Published on Dec 4, 2018 10:56 PM IST

ThugsOfHindostan1

అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ కలయికలో విజ‌య్ కృష్ణ ఆచార్య‌ దర్శకత్వంలో వచ్చిన బాలీవుడ్ చిత్రం ‘థగ్స్ అఫ్ హిందుస్థాన్’. కత్రినా కైఫ్, సనా ఫాతిమా షేక్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా డిజ్పాయింట్ చేసింది.

మొదటి షో నుండే డివైడ్ టాక్ రావడంతో చిత్ర నిర్మాతలకు అలాగే డిస్ట్రిబ్యూటర్లకు ఈ చిత్రం భారీ నష్టాలను మిగిల్చింది. అయితే ఈ చిత్రం ‘బాహుబలి’ రికార్డుల్ని దాటుతుందని అందరూ భావిస్తే.. తీరా రిలీజ్ అయ్యాక అన్ని భాషల్లోనూ చతికిలబడింది. ఇక తాజాగా ఈ చిత్రాన్ని చైనాలో కూడా డిసెంబర్ 28న భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. మరి చైనాలో అయినా ఈ చిత్రం హిట్ అవుతుందేమో చూడాలి.

ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు