గట్టి నిబంధనల మధ్య మెగాస్టార్ మూవీ

Published on Jan 26, 2020 12:50 pm IST

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టెయిన్మెంట్స్ సంస్థతో కలిసి రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం మెగాస్టార్ పకడ్బందీ నిబంధనలు పెట్టుకున్నారట. డేట్స్, బడ్జెట్ రెండు విషయాల్లో ఈ నిబంధనలు పెట్టుకున్నారట చిరు.

సినిమా చిత్రీకరణను 90 రోజుల్లో పూర్తిచేయాలని కొరటాల శివకు షూటింగ్ మొదలయ్యే ముందే చెప్పారట. దాని ప్రకారమే శివ ప్లాన్ చేసుకుని విరామం లేకుండా రాత్రి, పగలు షూటింగ్ చేస్తున్నారట. ఇక బడ్జెట్ విషయంలో అయితే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఎక్కడా అనవసర ఖర్చులు లేకుండా అవసరమైన చోటే ఖర్చు పెడుతున్నారట. మొత్తానికి చిత్రాన్ని అన్ని విధాల టైట్ ప్లానింగ్ మధ్య రూపొందిస్తున్నారు టీమ్.

సంబంధిత సమాచారం :

X
More