ఓవర్సీస్ లో సెన్సేషనల్ ఓపెనింగ్స్ అందుకున్న “టిల్లు స్క్వేర్”

ఓవర్సీస్ లో సెన్సేషనల్ ఓపెనింగ్స్ అందుకున్న “టిల్లు స్క్వేర్”

Published on Mar 30, 2024 8:01 AM IST

యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కించిన క్రేజీ ఎంటర్టైనర్ చిత్రం “టిల్లు స్క్వేర్”. మరి గతంలో వచ్చిన డీజే టిల్లు కి కొనసాగింపుగా వచ్చిన ఈ చిత్రం కూడా మంచి టాక్ ని యూనానిమస్ గా అందుకొని ఇప్పుడు వసూళ్ల పరంగా కూడా అదరగొట్టేస్తుంది.

అయితే గత సినిమా అందుకున్న వసూళ్ళని యూఎస్ మార్కెట్ లో టిల్లు స్క్వేర్ ఈజీగా బద్దలు కొట్టేస్తుంది. లేటెస్ట్ గా ఓవర్సీస్ లో వసూళ్లు అయితే సిద్ధూ కెరీర్ లోనే ఒక రికార్డు ఓపెనింగ్స్ అని చెప్పాలి. ఈ చిత్రం కేవలం ప్రీమియర్స్ మరియు డే 1 తోనే 1 మిలియన్ డాలర్స్ మార్కుని దాటేసింది.

ఏకంగా 1.2 మిలియన్ డాలర్స్ మార్క్ ని ఈ చిత్రం అందుకోవడం విశేషం. మరి మొదటి రోజుకే ఇలా ఉంటే వీకెండ్ కి సినిమా ఏ రేంజ్ లో అదరగొడుతుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి రామ్ మిర్యాల, అచ్చు సంగీతం అందించగా భీమ్స్ నేపథ్య సంగీతం అందించాడు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చూన్ 4 సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు