వైష్ణవ్, క్రిష్ ల ప్రాజెక్ట్ టైటిల్, ఫస్ట్ లుక్ కి ముహూర్తం ఫిక్స్!

Published on Aug 18, 2021 10:37 am IST


“ఉప్పెన” సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న మెగా సెన్సేషనల్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ ఆ సినిమా తర్వాత విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో సినిమా అనౌన్స్ చేసి మరింత ఆసక్తి రేపాడు. చాలా వేగంగా ఫినిష్ చేసేసిన ఈ చిత్రం ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్ కి కూడా రెడీ అయ్యిపోయింది. అయితే ఇంకా టైటిల్ కూడా రివీల్ కాని ఈ చిత్రంపై మేకర్స్ ఇప్పుడు అధికారిక అప్డేట్ ఒకటి చిన్న వీడియోతో వదిలారు.

ఈ చిత్రం తాలూకా ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టైటిల్ ని ఈ వచ్చే ఆగష్టు 20న ఉదయం 10 గంటల 15 నిమిషాలకు రివీల్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన ఈ చిత్రంలో వైష్ణవ్ సరసన స్టేర్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందించారు. అలాగే క్రిష్ నిర్మాణ సంస్థ ఫస్ట్ ఫ్రేమ్ ప్రొడక్షన్స్ వారే ఈ చిత్రానికి నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :