“18 పేజెస్” నుండి టైమ్ ఇవ్వు పిల్లా స్నీక్ పీక్ రిలీజ్…మామూలుగా లేదుగా!

“18 పేజెస్” నుండి టైమ్ ఇవ్వు పిల్లా స్నీక్ పీక్ రిలీజ్…మామూలుగా లేదుగా!

Published on Nov 29, 2022 7:35 PM IST


టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కార్తికేయ2 బ్లాక్ బస్టర్ సక్సెస్ తో దూసుకు పోతున్నాడు. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 18 పేజెస్. జీఏ 2 పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ ల పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రం లో బబ్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 23, 2022 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ఈ మేరకు ఇందుకు సంబంధించిన ప్రమోషన్స్ ను షురూ చేయడం జరిగింది. అయితే ఈ చిత్రం లోని టైమ్ ఇవ్వు పిల్లా సాంగ్ ను శింబు పాడిన సంగతి అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని మేకర్స్ ఇటీవల ప్రకటించారు. తాజాగా ఈ సాంగ్ రికార్డింగ్ కి సంబంధించిన స్నేక్ పీక్ వీడియో ను చిత్ర యూనిట్ షేర్ చేయడం జరిగింది. ఈ వీడియో చాలా సరదాగా సాగింది. ఈ సాంగ్ ప్లే లిస్ట్ లను శాసించే అవకాశం ఉంది. ఫుల్ సాంగ్ ను డిసెంబర్ 5 న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి కథ సుకుమార్ అందించగా, పల్నాటి సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు