రజనీకాంత్ మరో సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నాడా..?

రజనీకాంత్ మరో సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నాడా..?

Published on Oct 8, 2026 4:09 PM IST

సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘జైలర్’ చిత్రం గురించి అందరికీ తెలిసిందే. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాకు కొనసాగింపుగా వస్తున్న ‘జైలర్ 2’ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సీక్వెల్ దసరా కానుకగా అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ కోసం రజనీకాంత్, నెల్సన్‌లు భారీగా పారితోషికం అందుకోగా, ప్రముఖ నిర్మాత నాగవంశీ ఈ చిత్రం తెలుగు హక్కులను రికార్డు ధరకు సొంతం చేసుకున్నారు.

అయితే, ఈ ఫ్రాంచైజీ ఇక్కడితో ఆగడం లేదు. దర్శకుడు నెల్సన్ వద్ద ‘జైలర్ 3’కి సంబంధించిన సరికొత్త కథాంశం సిద్ధంగా ఉందని, దానికి సంబంధించిన హింట్‌ను ‘జైలర్ 2’ ఎండ్ క్రెడిట్స్ మరియు క్లైమాక్స్‌లో చూపించనున్నారని తెలుస్తోంది. మూడో భాగం కార్యరూపం దాల్చాలంటే మాత్రం ‘జైలర్ 2’ భారీ వసూళ్లను రాబట్టి పెట్టుబడులను తిరిగి రాబట్టుకోవాల్సి ఉంటుంది.

రజనీకాంత్ కూడా ఈ మూడో భాగంలో నటించేందుకు సుముఖంగా ఉండటంతో, అంతా అనుకున్నట్లు జరిగితే సన్ పిక్చర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘జైలర్ 3’ని నిర్మించే అవకాశం ఉంది. అన్ని కుదిరితే ఈ మూడో భాగం 2028లో పట్టాలెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.

తాజా వార్తలు