సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో చేస్తున్న సంచలన ప్రాజెక్ట్ ‘వారణాసి’ కోసం అందరికీ తెలిసిందే. గ్లోబల్ లెవెల్లో ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఏకైక భారతదేశపు సినిమా ఇదే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సినిమా కోసం రాజమౌళి తన గత సినిమాలు బాహుబలి, RRR లకి మించి ప్రతీ అంశంలోనూ బెటర్ గా ప్రెజెంట్ చేస్తూ వస్తున్నారు.
ఇక ఇదిలా ఉండగా వారణాసి పై ఓ క్రేజీ బజ్ ఇపుడు వినిపిస్తుంది. ఈ సినిమా కోసం మేకర్స్ ఒక ప్రత్యేకమైన కొత్త భాషని సృష్టించినట్టు తెలుస్తుంది. సినిమాలో కొన్ని కీలక సీక్వెన్స్ ల విషయంలో ఇది అవసరం అవుతుంది అని గతంలో బాహుబలి సినిమాకి ప్రత్యేకంగా సిద్ధం చేయించిన ‘కిలికి’ లానే ఈసారి మరో కొత్త లిపిని, భాషని సృష్టించారట. సో వారణాసి మాత్రం అడ్వెంచర్ మూవీ లవర్స్ కి ఓ గట్టి ట్రీట్ ఇచ్చేలా ఉందని చెప్పవచ్చు.


