అఫీషియల్ : ‘పెద్ది’ బిగ్గెస్ట్ ఈవెంట్‌కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్..!

అఫీషియల్ : ‘పెద్ది’ బిగ్గెస్ట్ ఈవెంట్‌కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్..!

Published on May 29, 2026 9:01 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం దేశవ్యాప్తంగా ప్రమోషన్స్‌తో సందడి చేస్తోంది. తాజాగా ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.

విజయవాడ వేదికగా ‘పెద్ది’ చిత్రం రికార్డు స్థాయి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు సిద్ధమైంది. జూన్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ భారీ వేడుక అత్యంత వైభవంగా జరగనుంది. టాలీవుడ్ చరిత్రలోనే ఇది ఒక అతిపెద్ద ప్రమోషనల్ ఈవెంట్‌గా నిలిచిపోనుందని, దీనికి పలువురు టాప్ సెలబ్రిటీలు హాజరుకానున్నారని మేకర్స్ ప్రకటించారు.

భోపాల్‌లో జరిగిన గ్రాండ్ ఈవెంట్ తర్వాత, అంతకంటే భారీ ఎత్తున విజయవాడలో ఈ ‘రోర్’ వేడుకను ప్లాన్ చేశారు. బుచ్చిబాబు సానా మార్క్ విలేజ్ ఎమోషన్స్, రామ్ చరణ్ క్రేజ్ తోడుకావడంతో ‘పెద్ది’ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. జూన్ 4న రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

తాజా వార్తలు