ఆ యంగ్ హీరో ఈ సారి కొత్తగా ట్రై చేశాడు.

Published on Aug 28, 2019 10:45 am IST

హీరో శ్రీవిష్ణు పరిశ్రమలో ఓ విభిన్న ఇమేజ్ సొంతం చేసుకున్నారు. తాజాగా ఆయన బ్రోచేవారెవరురా అనే ఓ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ తో మంచి విజయం అందుకున్నారు. తన తదుపరి చిత్రంగా ‘తిప్పరా మీసం’లో నటిస్తున్నారు. తన గత చిత్రాలకు భిన్నంగా శ్రీవిష్ణు ఈ చిత్రంలో మాస్ రోల్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో కూడా ఆయన బాగా పెరిగిన గడ్డం, మెలితిప్పిన మీసంతో మాస్ లుక్ లో కనిపిస్తున్నారు.

శ్రీవిష్ణు సరసన నిక్కీ తంబోలి నటిస్తుండగా, కృష్ణ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. రిజ్వాన్ ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితమౌతున్న ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం సమకూర్చుతున్నాడు. త్వరలో ఈ చిత్ర టీజర్ ని విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. గతంలో క్లాస్ టచ్ ఉన్న చిత్రాలలో నటించిన శ్రీవిష్ణు తిప్పరా మీసం లో ఏమైనా కొత్తగా ట్రై చేశాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం :