సూపర్ స్టార్ సినిమాకి టైటిల్ ఫిక్స్ ?

Published on Jan 26, 2020 11:41 am IST

సూపర్ స్టార్ రజినీకాంత్ తో తన తరువాత సినిమాను ప్లాన్ చేసుకున్నాడు ‘విశ్వాసం’ ఫేమ్ డైరెక్టర్ శివ. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాకి తమిళంలో టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అన్నాత్త‌ అనే టైటిల్ ను పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కూడా శివ గత సినిమాల శైలిలోనే పక్కా మాస్ అంశాలతో మంచి ఎమోషనల్ గా సాగుతుందట. ముఖ్యంగా రజినీ క్యారెక్టర్ చాలా బాగుంటుందని తెలుస్తోంది.

అన్నట్టు ఈ సినిమాలో మాజీ బ్యూటీలు ఖుష్బూ, మీనా రజిని సరసన న‌టిస్తోన్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ కూడా కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. స‌న్‌పిక్చ‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గోపీచంద్ తో ‘శౌర్యం’ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయిన శివ, తమిళ స్టార్ అజిత్ తో వరుసగా సినిమాలు తీసి బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందుకున్నాడు. మరి ఇప్పుడు రజినీతో చేయబోయే సినిమాతో ఏ రేంజ్ హిట్ అందుకుంటాడో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More