టైటిల్, విడుదల తేదీలను ఫిక్స్ చేసుకున్న వరుణ్ తేజ్ సినిమా !
Published on Dec 4, 2017 4:04 pm IST

మెగా హీరో వరుణ్ తేజ్ నూతన దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా యొక్క టైటిల్ ను కొద్దిసేపటి క్రితమే రివీల్ చేశారు చిత్ర యూనిట్. ముందు నుండి అంటున్నట్టుగానే ఈ సినిమాకి ‘తొలి ప్రేమ’ అనే పేరునే ఖాయం చేశారు.

పూర్తిస్థాయి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న రిలీజ్ చేయాలని కూడా నిర్ణయించారు. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర క్రియేషన్స్ పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా హీరోయిన్ గా నాటివుండగా ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

 
Like us on Facebook