టాలీవుడ్ బాక్సాఫీస్ మరో మూడు నెలలు ఇలాగే !

Published on May 2, 2021 8:29 pm IST

కరోనా సెకెండ్ వేవ్ వల్ల మళ్ళీ బాక్సాఫీస్ వద్ద మరో మూడు నెలలు ఖాళీ ఏర్పడేలా ఉంది. ఇప్పటికే తెలుగు సినిమాల రిలీజ్ కి మళ్ళీ బ్రేక్ పడింది. గత ఏడాది మొత్తం ఖాళీ అయినట్టే ఈ ఏడాది కూడా మరో మూడు నెలలు వరకూ అలాగే అవుతుందేమో అనే అనుమానం ఇప్పటికే మొదలైపోయింది. నిజానికి ఈ సెకెండ్ వేవ్ లేకపోతే.. ఈ సమ్మర్ అంతా క్రేజీ సినిమాలతో బాక్సాఫీస్ కళకళలాడిపోయేది. కానీ కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోవడంతో తమ సినిమాలను పోస్ట్ ఫోన్ చేసుకున్నారు మేకర్స్.

‘లవ్ స్టోరీ’ ‘టక్ జగదీష్’, ఆ వెంటనే.. తలైవి, ఆ తరువాత ఒక వారం గ్యాప్ లో ‘విరాట పర్వం’, ‘పాగల్’ ఇలా మంచి కంటెంట్ ఉన్న సినిమాలన్నీ పోస్ట్ ఫోన్ అవ్వక తప్పలేదు. మరి ఈ కరోనా ఎప్పుడు పోతుందో.. మళ్ళీ థియేటర్స్ కి జనం ఎప్పుడు బారులు తీస్తారో చూడాలి. ఇప్పుడున్న సమాచారం ప్రకారం మొత్తంగా జూన్ రెండో వారం వరకు ఇదే పరిస్థితి కొనసాగొచ్చు. మరి ఆ తరువాత అయినా సినిమాలు రిలీజ్ చేస్తే థియేటర్లకు జనం రావడానికి మరో నెల రోజులు పడుతుంది, కాబట్టి మూడు నెలల వరకూ బాక్సాఫీస ఖాళీ అయిపోయినట్టే.

సంబంధిత సమాచారం :