‘లాల్ సలాం’ లో రజినీకాంత్ సోదరిగా టాలీవుడ్ ప్రముఖ నటి

Published on Mar 1, 2023 3:00 am IST

కోలీవుడ్ సూపర్ స్టార్ నటుడు రజినీకాంత్ ఒక ముఖ్య పాత్రలో అలానే ఆయన కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో రూపొందనున్న మూవీ లేటెస్ట్ మూవీ లాల్ సలాం. ఇటీవల గ్రాండ్ గా అధికారిక పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయిన ఈ మూవీలో విష్ణు విశాల్ ప్రధాన పాత్ర చేస్తుండగా ఇందులో టాలీవుడ్ ప్రముఖ నటి జీవిత రాజశేఖర్ రజినీకాంత్ సోదరి పాత్రలో కనిపించనున్నారు. కాగా ఆమె మార్చి 7న చెన్నైలో ప్రారంభం కానున్న ఈ మూవీ షూట్ లో జాయిన్ అవ్వనున్నారు జీవిత.

1990లో చివరిగా మగాడు సినిమాలో కనిపించిన జీవిత, దాదాపుగా 33 ఏళ్ళ తరువాత ఈ సినిమా ద్వారా వెండితెర పై కనిపించనున్నారు. కాగా ఈ మూవీని ఎంతో భారీ స్థాయిలో లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు నిర్మిస్తుండగా ప్రఖ్యాత సంగీత దర్శకడు ఏఆర్ రహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. యువ నటుడు విక్రాంత్ మరొక కీలక పాత్ర చేస్తున్న ఈ మూవీని క్రికెట్ నేపథ్యంలో అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా దర్శకురాలు ఐశ్వర్య రజినీకాంత్ ఎంతో అద్భుతంగా చిత్రీకస్తున్నారు అని అంటోంది యూనిట్.

సంబంధిత సమాచారం :