యుంగ్ హీరోలు ఆ హీరోని ఫాలో ఐతే సరి…!

Published on Nov 13, 2019 2:40 pm IST

చిత్ర పరిశ్రమలో నెగ్గుకు రావడం అంత సులభమైన వ్యవహారం కాదు. ఇక హీరోగా ఎదగడమంటే కత్తిమీద సామే. చాలా మంది స్టార్ హీరోల వారసులు కూడా చిత్ర పరిశ్రమలో సక్సెస్ కాలేకపోయారు. అలాంటిది బాలీవుడ్ లో ఎటువంటి గాడ్ ఫాదర్స్ లేకుండానే వరుసబెట్టి హిట్స్ కొడుతున్నాడు యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా. టీవీ యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన ఆయుష్ 2012లో విక్కీ డోనర్ చిత్రంతో తెరంగేట్రం చేశారు. ఓ కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఆ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.

ఏడేళ్లలో 13సినిమాలు చేసిన ఈ యంగ్ హీరో ఇప్పటికే 7 హిట్లు తన ఖాతాలు వేసుకున్నాడు. ఆయుష్మాన్ కి తాజాగా విడుదలైన బాలా చిత్రం వరుసగా ఐదవ హిట్ కావడం విశేషం. ఇప్పటికే బాలా మూవీ 50కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ ఏడాది ఆయన విడుదల చేసిన ఆర్టికల్ 15, డ్రీమ్ గర్ల్ చిత్రాలు కూడా మంచి వసూళ్లతో సక్సెస్ ఫుల్ చిత్రాలుగా నిలిచాయి.

ఆయుష్మాన్ సినిమాల ఎంపిక చూసిన వారెవరైనా అతన్ని మెచ్చుకోకుండా ఉండలేరు. టాలీవుడ్ లోని యంగ్ హీరోలైన శర్వానంద్, నితిన్, నాని, విజయ్ దేవరకొండ, కార్తికేయ లాంటి వారు ఆయుష్మాన్ ని ఫాలో ఐతే సరి. విభిన్నమైన కాన్సెప్ట్ తో తక్కువ బడ్జెట్ పెట్టి చేసే సినిమాలు ఎంతటి అద్భుత ఫలితాలను ఇస్తాయో ఆయుష్మాన్ చిత్రాలు నిరూపించాయి.

సంబంధిత సమాచారం :

More