రాజమౌళి సినిమాలో నటించనున్న టాప్ హీరోయిన్ ?
Published on Mar 4, 2018 12:54 pm IST

రాజమౌళి ఎన్టీఆర్ చరణ్ తో మల్టి స్టారర్ సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసేందే. డివివి దానయ్య ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. ఇద్దరు హీరోలు ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ మూవీలో చరణ్ సరసన సమంత నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రాజమౌళి ఈగ సినిమాలో సమంత నటించింది, అలాగే చరణ్ సమంత రంగస్థలం సినిమాలో నటించారు.

రాజమౌళి స్టైల్ లో తెరకేక్కబోయే ఈ సినిమాలో గ్రాఫిక్ష్స ఉండవని సమాచారం. ఫ్యామిలి ఎమోషన్స్ తో రూపొందుతున్న ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ నుండి ప్రారంభం కానుంది. కీరవాణి సంగీతం అందించబోతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రాజమౌళి చరణ్ ఎన్టీఆర్ తో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన దగ్గరినుండి ఈ సినిమాపై రోజుకో వార్తా బయటికి వస్తోంది.

 
Like us on Facebook