పాతబస్తీలో ప్రారంభం కానున్న టాప్ హీరో చిత్ర షూటింగ్ !
Published on Mar 2, 2018 11:50 am IST

వెంకటేష్ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ఈ నెల 12 నుండి హైదరాబాద్ పాత బస్తీలో షూటింగ్ మొదలుకానుంది.అనుప్ రూబెన్స్ సంగీతం అందించబోతున్న ఈ సినిమాలో శ్రియ హీరోయిన్ గా నటిస్తోంది. నారా రోహిత్ సెకండ్ హీరోగా నటించబోతున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ నటించే అవకాశాలు ఉన్నాయి.

తక్కువ రోజుల్లో షూటింగ్ పూర్తి చెయ్యనున్నారు చిత్ర యూనిట్. వెంకటేష్ మరియు శ్రియ నటించే 72వ సినిమా ఇది. యాదృచ్చికంగా ఇద్దరికి 72వ సినిమా అవ్వడం విశేషం. డిఫరెంట్ కాన్సెప్ట్ తో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో తెరకేక్కబోతున్న ఈ సినిమాకు తమిళ్ కెమెరామెన్ రామానుజం సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.

 
Like us on Facebook