దీపావళి కి నలుగురు స్టార్ హీరోలు కత్తిగట్టారు.

Published on Aug 24, 2019 8:21 pm IST

తమిళనాట ఈ దీపావళి టపాసులతో పాటు, నలుగురు స్టార్ హీరోల సినిమాలతో మోతమోగనుంది. కోలీవుడ్ లో స్టార్ డమ్ కలిగిన నలుగురు హీరోలు తమ చిత్రాలను విడుదలకు సిద్ధం చేశారు. తలపతి విజయ్ బిగిల్, ధనుష్ పటాస్, విశాల్ యాక్షన్ మరియు కార్తీ ఖైదీ చిత్రాలు దీపావళి విడుదలకు సిద్ధమయ్యాయి. దీనితో కోలీవుడ్ లో దీపావళి పోరు రసవత్తరంగా మారనుంది.

యంగ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న బిగిల్ మూవీపై భారీ అంచనాలున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ వచ్చిన మెర్సల్ చిత్రం భారీ విజయం సాధిచడంతో పాటు, బిగిల్ మూవీలో విజయ్ వైవిధ్యమైన గెటప్స్ లో కనిపించనుండటంతో చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ధనుష్ దురై సేతు కుమరన్ దర్శకత్వం లో చేస్తున్న పటాస్ మూవీ కూడా దీపావళికి రానుంది. ఈ చిత్రంలో ధనుష్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు.

ఇక హీరో విశాల్ దర్శకుడు సి సుందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం యాక్షన్. టెర్రరిజం నేపథ్యంలో తెరకెక్కుతుంది. అలాగే హీరో కార్తీ ప్రయోగాత్మక చిత్రం ఖైదీ. ఈ మూవీ మొత్తం రాత్రి నేపథ్యంలో నడవడం గమనార్హం. ఈ రెండు చిత్రాలు కూడా దీపావళికే విడుదలకు సిద్ధమయ్యాయి. దీంతో నలుగురు హీరోలు దీపావళికి
తమ సినిమాలతో అభిమానుల గుండెల్లో పటాసులు పేల్చనున్నారు.

సంబంధిత సమాచారం :