ప్రీమియర్ల రూపంలోనే రికార్డ్ సెట్ చేయనున్న మహేష్ !


సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలంటే ఎక్కువ ఆసక్తి చూపే యూఎస్ ప్రేక్షకుల్లో ఆయన తాజా చిత్రం ‘స్పైడర్’ విషయంలో ఆ ఆసక్తి మరింత ఎక్కువగా కనిపిస్తోంది. భారీ బడ్జెట్ తో రూపొందటం, మురుగదాస్ దర్శకత్వం వహించడం, పాటలు, ట్రైలర్స్ అన్నీ ఆకట్టుకోవడంతో సినిమాలో కంటెంట్ గొప్ప స్థాయిలో ఉంటుందని అందరూ అభిప్రాయపడుతున్నారు. దీంతో సినిమా ఓపెనింగ్స్ అద్దిరిపోయే స్థాయిలో ఉంటాయని అంచనా.

పైగా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా తారా స్థాయిలో జరుగుతున్నాయి. కేవలం ఈ బుకింగ్స్ ద్వారానే చిత్రం హాఫ్ మిలియన్ డాలర్ మార్క్ చేరుకుందట. దానికి తోడు యూఎస్ డిస్ట్రిబ్యూటర్లు చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేస్తుండటంతో 26వ తేదీ రాత్రి ప్రదర్శించబోయే ప్రీమియర్ల ద్వారానే దగ్గర దగ్గర మిలియన్ డాలర్ వసూలు కావచ్చని ట్రేడ్ వర్గాల అంచనాలు చెబుతున్నాయి. ఈ అంచనాల ప్రకారమే ప్రీమియర్లు మిలియన్ డాలర్ ను రాబడితే మహేష్ పేరిట సరికొత్త రికార్డ్ నెలకొనడం ఖాయం. గత వారం విడుదలైన ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ కూడా ప్రీమియర్లతో హాఫ్ మిలియన్ డాలర్ వసూలు చేసిన సంగతి తెలిసిందే.