విక్రమ్ కొత్త సినిమా ట్రైలర్ ఎప్పుడంటే

Published on Jun 30, 2019 5:52 pm IST

స్టార్ హీరో విక్రమ్ నటిస్తున్న కొత్త చిత్రం ‘కదరం కొండన్’. కమల్ హాసన్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై ఈ చిత్రం నిర్మితమవుతోంది. కొన్ని నెలల క్రితం విడుదలైన ఈ చిత్ర టీజర్ బాగానే మెప్పించింది. కానీ ట్రైలర్ అయితే ఇప్పటి వరకు విడుదలకాలేదు. మే 31నాడే సినిమా విడుదలవ్వాల్సి ఉండగా పలు కారణాల రీత్యా ఆగిపోయింది. తాజా సమాచారం మేరకు అన్నిపనులు పూర్తవడంతో ట్రైలర్ సిద్ధమైందని తెలుస్తోంది.

జూలై 3వ తేదీన ఆ ట్రైలర్ విడుదలకావచ్చని తమిళ సినీ వర్గాల టాక్. సినిమాను కూడా జూలై 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ‘చీకిటి రాజ్యం’ ఫేమ్ రాజేష్ ఎమ్ సెల్వ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. విక్రమ్ గత సినిమాలు పెద్దగా మెప్పించకపోవడంతో ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. తెలుగులో కూడా జూలై 19నాడే చిత్రం విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

More