రామ్ గోపాల్ వర్మ తన తాజా చిత్రం ‘కిల్లింగ్ వీరప్పన్’ టైటిల్ లో చందనపు స్మగ్లర్ వీరప్పన్ జీవితగాధను తెరకెక్కిస్తున్న విషయం తెలిసినదే. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. పరుల్ యాదవ్, యజ్ఞ శెట్టి హీరోయిన్స్ గా కనిపించనున్నారు.
ఈ సినిమా ట్రైలర్ను ఈ నెల 12న విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో ఈ సినిమా విడుదలకానుంది. ఢిల్లీకి చెందిన సందీప్ భరద్వాజ్ వీరప్పన్ పాత్ర పోషిస్తున్నాడు.


