ట్రైలర్ టాక్: ‘మన శంకర వరప్రసాద్ గారు’.. దుమ్ము లేపేశారు!

ట్రైలర్ టాక్: ‘మన శంకర వరప్రసాద్ గారు’.. దుమ్ము లేపేశారు!

Published on Jan 4, 2026 4:19 PM IST

Mana Shankara Vara Prasad

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నయనతార (Nayanthara) హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “మన శంకర వరప్రసాద్ గారు” (Mana Shankara Vara Prasad Garu). చిరంజీవి అభిమానులకి ట్రీట్ ఇచ్చే విధంగా మెయిన్ గా ఎంతో కాలం నుంచి మిస్ అవుతున్న ఫన్ యాంగిల్ ని ఎక్కువ హైలైట్ చేస్తూ వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఇక ఫైనల్ గా ఈ ట్రైలర్ కట్ ని మేకర్స్ తీసుకొచ్చేసారు. అయితే ఈ ట్రైలర్ మాత్రం ఇప్పుడు వరకు వచ్చిన అన్ని కంటెంట్ లకి మించి అదిరే లెవెల్లో ఉందని చెప్పాలి. మొదటిగా దర్శకుడు అనీల్ రావిపూడి మెగాస్టార్ ని ప్రెజెంట్ చేసిన మొదటి సీన్స్ అన్నీ ఎక్సలెంట్ గా కనిపిస్తున్నాయి. మాస్ పరంగానే కాకుండా గ్రేస్ ని కూడా ఎక్కడా మిస్ చేయకుండా దుమ్ము లేపేశారు.

ఇక నెక్స్ట్ నుంచి మొదలైన ఫ్యామిలీ సీన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా గట్టిగానే ఉండేలా ఉందని చెప్పాలి. మెయిన్ గా నయనతార, చిరంజీవి మధ్యలో కెమిస్ట్రీ కామెడి సీన్స్ కేజ్రీగా ఉన్నాయి. అంతే కాకుండా లాస్ట్ లో వెంకీ మామ ఎంట్రీ అందులోని చిరంజీవితో కలిసి క్లాష్ డైలాగ్స్ కూడా ఆడియెన్స్ లో ఓ రేంజ్ లో క్లిక్ అయ్యేలా ఉన్నాయని చెప్పొచ్చు. ఇలా మొత్తానికి మాత్రం ఈ సంక్రాంతి రేస్ లో అనీల్ రావిపూడి ఇంకోసారి కొట్టేలా ఉన్నారని చెప్పాలి.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

తాజా వార్తలు