ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ డైరెక్టర్స్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ఆయనతో సినిమా చెయ్యడానికి సాతర్ హీరోలు మరియు స్టార్ నిర్మాతలు ఆసక్తి చూపుతారు. తన మాటల గారడితో త్రివిక్రమ్ ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చెయ్యడమే కాకుండా మంచి ఫిలాసఫీ కూడా చెప్తుంటాడు. త్రివిక్రమ్ లేటెస్ట్ మూవీ ‘S/O సత్యమూర్తి’. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా టైటిల్ అనుకున్నప్పటి నుంచే ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అందరికీ అర్థమైంది, ట్రైలర్ చూసాక దాన్ని ఖరారు చేసుకున్నారు.
త్రివిక్రమ్ డైరెక్టర్ గా మొదట్లో కాస్త డిఫరెంట్ జోనర్ లో సినిమాలు చేసారు. అది సరిగా వర్క్ అవుట్ అవ్వలేదు. దాంతో త్రివిక్రమ్ తను రైటర్ గా సక్సెస్ అయిన ఫ్యామిలీ సెంటిమెంట్ మీదే మళ్ళీ దృష్టి పెట్టాడు. త్రివిక్రమ్ చివరి సినిమా ‘అత్తారింటికి దారేది’ పూర్తి కుటుంబ కథా చిత్రం. ఇప్పుడు ‘S/O సత్యమూర్తి’ని కూడా దే ఫ్యామిలీ కంటెంట్ తో తీసారు. అంతే కాకుండా విలువలే ఆస్తి అని పెట్టిన ట్యాగ్ లైన్ అందరినీ ఆకట్టుకుంటోంది. దీన్నిబట్టి త్రివిక్రమ్ ఎక్కువగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలపైనే నమ్మకం పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. అలాగే టైటిల్ ని బట్టి ఈ సినిమాలో ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ ఎక్కువ ఉంటుందని సమాచారం.
మరికొందరేమో కుటుంబ విలువల గురించి చెప్పిన అత్తారింటికి దారేది సినిమా ఎంత పెద్ద కమర్షియల్ సక్సెస్ అయ్యిందో, అలానే ‘S/O సత్యమూర్తి’ కూడా బిగ్గెస్ట్ హిట్ అవుతుందని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. ‘S/O సత్యమూర్తి’లో అల్లు అర్జున్ సరసన సమంత, నిత్య మీనన్, ఆద శర్మ హీరోయిన్స్ గా కనిపించనున్నారు.


