‘S/O సత్యమూర్తి’ చిత్రంలోని ఓ హాట్ లిప్‌లాక్ సన్నివేశానికి కత్తెర పడిందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. సినిమాను సెన్సార్‌కు పంపడానికి కంటే ముందే త్రివిక్రమ్ ఈ సన్నివేశాన్ని తీసేశారట. సాధారణంగా త్రివిక్రమ్ సినిమాల్లో అశ్లీలతకు గానీ, అసభ్యతకు గానీ చోటుండదు. సినిమాలో గ్లామర్ కూడా మోతాదు మించి ఉండదు. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్, అదా శర్మల మధ్య ఒక హాట్ హాట్ లిప్‌లాక్ సన్నివేశాన్ని తెరకెక్కించారని రూమర్.
S/O సత్యమూర్తి కోసం త్రివిక్రమ్, అల్లు అర్జున్ అభిమానులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఆడియన్స్ త్రివిక్రమ్ సినిమాలను విపరీతంగా ఆదరిస్తారన్న విషయం కూడా తెలిసిందే. వారికి ఇబ్బంది కలగకూడదనే ఈ సన్నివేశాన్ని సినిమాలోనుంచి తీసేసినట్టు సమాచారం. సమంత, నిత్యామీనన్, అదా శర్మలు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను రాధాకృష్ణ నిర్మించారు. దేవీశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఇప్పటికే మ్యాజిక్ చేస్తోంది. ఇక ఇప్పటికే అన్ని కార్యక్రమాలను ముగించుకున్న ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది.


