పవన్ కళ్యాణ్ కోసం మరో కథ కూడా సిద్ధమైపోయింది

19th, October 2016 - 12:33:57 PM

pawan-trivikram
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం సినిమాలు స్పీడ్ పెంచేశాడు. 2019 లో ఎలక్షన్స్ రానుండటంతో ఆలోపు ఎన్ని సినిమాలు వీలయితే అన్ని సినిమాలు చేసెయ్యాలని ఫిక్సైన ఆయన ఇప్పటికే దర్శకుడు డాలి డైరెక్షన్లో ‘కాటమరాయుడు’ సినిమాను మొదలుపెట్టేసి షూటింగ్ కూడా చేసేస్తున్నాడు. అలాగే మరోవైపు తమిళ దర్శకుడు నీసన్ తో దసరా రోజున ఓ సినిమాకి సైన్ చేసేశాడు. ఈ రెండు కాకా ఇప్పుడు పవన్ కోసం మరో కథ సిద్ధమైంది.

ఆ కథని సిద్ధం చేసింది మరెవరో కాదు పవన్ కు ఆప్త మిత్రుడు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇప్పటి వరకూ పవన్ తో త్రివిక్రమ్ సినిమా ఉంటుందని, కథా చర్చలు జరుగుతున్నాయని వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం త్రివిక్రమ్ పూర్తి స్థాయి కథను సిద్ధం చేసేశాడని బలమైన వార్త తెలుస్తోంది. ఇకపోతే ఈ చిత్రాన్ని 2017 లో జనవరిలో మొదలుపెట్టే అవకాశముంది. ఈ ప్రాజెక్టుకు సంబందించిన ఇతర వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.