SSMB 28 : మహేష్ కోసం సాలిడ్ స్టోరీ రెడీ చేసిన త్రివిక్రమ్ …..?

SSMB 28 : మహేష్ కోసం సాలిడ్ స్టోరీ రెడీ చేసిన త్రివిక్రమ్ …..?

Published on Jul 2, 2022 2:00 AM IST

సూపర్ స్టార్ మహేష్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ గతంలో అతడు, ఖలేజా సినిమాలు తీశారు. ఈ రెండు సినిమాలు ఇప్పటికీ కూడా టివిలో ప్రసారం అయితే చాలు మంచి రేటింగ్స్ అందుకుంటూ ఉంటాయి. ఆ విధంగా ప్రేక్షకాభిమానుల్లో ఈ మూవీస్ పై మంచి క్రేజ్ ఉంది. ఇక త్వరలో మహేష్, త్రివిక్రమ్ కలిసి పని చేయనున్న సెంబు SSMB 28 మూవీ కోసం అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనున్న ఈ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ ఎంతో భారీ స్థాయిలో నిర్మించనుండగా థమన్ సంగీతం అందించనున్నారు. ఇటీవల అధికారిక ముహుర్తహూం కూడా జరుపుకున్న ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం ఒక న్యూస్ ట్రెండ్ అవుతోంది. దాదాపుగా పన్నెండేళ్ల గ్యాప్ తరువాత మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ మూవీ కోసం త్రివిక్రమ్ ఒక సాలిడ్ పవర్ఫుల్ స్టోరీ సిద్ధంచేశారట. ఇందులో మహెష్ పాత్ర తో పాటు స్క్రీన్ ప్లే కూడా అదిరిపోతుందట. యాక్షన్ జానర్ లో సాగుతూ మంచి కమర్షియల్ హంగులు కూడా కథలు జోడించారట. మొత్తంగా దీనితో ఈ క్రేజీ ప్రాజక్ట్ పై మరింతగా అంచనాలు పెరిగిపోయాయి. ఈనెలలోనే పట్టాలెక్కనున్న ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు